టాలీవుడ్ దర్శకులు ఇటీవలి కాలంలో ఇతర భాషల హీరోలకు మంచి హిట్స్ ఇస్తున్నారు. అలాంటి వారిలో వెంకీ అట్లూరి పేరు తప్పక చెప్పుకోవాలి. యువ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన నుంచి ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతోంది. ఈసారి ఆయన తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే విధంగా ఓ ఎంటర్టైనర్‌ని తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఓటిటి డీల్ విషయంలోనూ సంచలన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ ఓటిటి సంస్థ ఈ చిత్ర హక్కుల కోసం దాదాపు 80 కోట్ల వరకు వెచ్చించిందని టాక్ వినిపిస్తోంది. ఇంత భారీ మొత్తం ఈ కాంబినేషన్ మీద ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది.
‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి ఈసారి సూర్యతో ఏ రకమైన కథను చూపించబోతున్నాడో అన్నది ప్రేక్షకుల్లో కుతూహలంగా మారింది.
