పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ఓజి కోసం అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలతో సినిమాపై ఊహించని స్థాయిలో హైప్ పెరిగింది.
ఇక మేకర్స్ మరో అప్‌డేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి రాబోయే కంటెంట్ అభిమానులకు మస్త్ ట్రీట్ అవుతుందని యూనిట్ చెబుతోంది. థమన్ తాజాగా ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, కొత్త అప్‌డేట్ సెప్టెంబర్ 14 ఉదయం 10.08 గంటలకు బయటకు రానుంది.
దీంతో ఆ అప్‌డేట్ ఏంటనే ఉత్సుకత అభిమానుల్లో పెరిగిపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ కనిపించనుంది.
