ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ నటించిన “ఓజి” గురించే హడావుడి జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించబోతుండటమే కాకుండా, అతనిపై రీసెంట్‌గా విడుదల చేసిన గ్లింప్స్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంది.
సాధారణంగా థమన్ ఇస్తున్న మ్యూజిక్‌కు ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది కానీ ఈసారి ఇచ్చిన స్కోర్ మాత్రం అభిమానుల అంచనాలను మించిపోయింది. అందుకే ఓజి మీద ఉన్న బజ్ మరింత పెరిగింది. ముఖ్యంగా ఆ మ్యూజిక్ బీట్స్ వినగానే ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఫుల్ పాజిటివ్ టాక్ ఇచ్చారు.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ మ్యూజిక్ ట్రాక్ మొత్తం నాలుగు నిమిషాలపాటు ఉంటుందని థమన్ చెప్పాడు. ఈ ట్యూన్ పూర్తిగా ఒక ట్రాన్స్ ఫీల్ కలిగించేలా కంపోజ్ చేశానని కూడా క్లారిటీ ఇచ్చాడు. దీనిని “ట్రాన్స్ ఆఫ్ ఓమి” పేరుతో ఈరోజు సాయంత్రం ఆరు గంటల మూడునిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు.
