యంగ్ హీరో తేజ సజ్జ, హీరోయిన్ రితిక నాయక్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ మిరాయ్ మొదటి నుంచి మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.
ప్రత్యేకంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ చిత్రం హవా చూపిస్తోంది. ప్రీమియర్ షోస్ కి ముందు నుంచే అద్భుతమైన బుకింగ్స్ రావడంతో రెండు లక్షల డాలర్లకిపైగా కలెక్షన్ రాబట్టింది. దీంతో సినిమా మీద ఉన్న హైప్ మరింత పెరిగింది.
తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రానా దగ్గుబాటి కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
