అఖండ 2’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మీద అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దాని సీక్వెల్ కావడంతో సహజంగానే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమా గురించి ఓటీటీ డీల్ విషయమై కూడా కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. మొదట్లోనే ఈ సినిమా రైట్స్ గురించి కొన్ని వార్తలు వినిపించినా, ఇప్పుడు మాత్రం నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో తీసుకుందని సమాచారం. సాధారణంగా ఆ ప్లాట్‌ఫార్మ్ కేవలం పాన్ ఇండియా రేంజ్ స్టార్స్ సినిమాలకు మాత్రమే ఇలాంటి డీల్ ఇస్తుంది. కానీ బాలకృష్ణ సినిమాకు కూడా అదే రేంజ్‌లో ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
‘డాకు మహారాజ్’ చిత్రం విజయాన్ని దృష్టిలో పెట్టుకుని నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
