టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ తన కెరీర్‌లో వరుసగా సినిమాలు చేస్తూ జోరుగా ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే ఆయన 41వ చిత్రాన్ని అధికారికంగా స్టార్ట్ చేశారు. ఈ సినిమాను రవి నేలకుడితి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరగుతోంది. ఈ క్రమంలో మేకర్స్ నుంచి ఓ కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్టు టీమ్ ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. దుల్కర్, పూజా హెగ్డే జంట కొత్తగా, ఫ్రెష్‌గా కనిపించబోతుందని.. ఈ కాంబినేషన్ ఆడియెన్స్‌ను ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది.
పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
