పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ఓజి చుట్టూ అభిమానుల్లో ఊహలు అతి ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా రేంజ్లోనూ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేస్తోంది.
ఇంకా ట్రైలర్ రిలీజ్ కానప్పటికీ, యూఎస్ మార్కెట్లోనే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కనిపించడం సినిమాపై ఉన్న హైప్‌కి నిదర్శనం. ట్రైలర్ రాక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా టాక్ ప్రకారం ఈ ట్రైలర్‌ని సెప్టెంబర్ 15న విడుదల చేయాలని టీమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రతిష్టాత్మకమైన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది.
