ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్తగా చేస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను అట్లీ డైరెక్ట్ చేస్తుండగా, షూటింగ్ వేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ ఎంట్రీ సన్నివేశాలను ప్రత్యేకంగా, గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తోంది.
మొదట ఈ సినిమాను 2026లో రిలీజ్ చేయాలని అట్లీ టీమ్ అనుకున్నా, తాజా సమాచారం ప్రకారం అది 2027కి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తోంది. అదే సమయంలో రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ SSMB29 కూడా అదే కాలంలో థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇలా చూస్తుంటే 2027లో అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర తలపడే అవకాశం కనబడుతోంది.
