టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్రహీరోయిన్లలో గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఇటీవల సత్యభామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా బిజీగా గడుపుతున్న కాజల్ పేరు ఇటీవల అనూహ్య కారణంతో వార్తల్లోకి వచ్చింది.
సోషల్ మీడియాలో ఆమెకు ప్రమాదం జరిగిందనే పుకార్లు వేగంగా చక్కర్లు కొట్టాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. అయితే ఈ గాసిప్స్ కు కాజల్ స్వయంగా స్పందించింది. తనకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని, తాను ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేసింది.
