టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు కొత్తగా వచ్చిన యువ నటుడు మౌళి తనూజ్ హీరోగా, శివాని నాగారం హీరోయిన్గా నటించిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’. ఈ చిత్రాన్ని సాయి మార్తాండ్ డైరెక్ట్ చేయగా, కామెడీతో పాటు యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడమే ప్రధాన ఆకర్షణ. విడుదలకు ముందు నుంచే ప్రమోషన్స్ బాగానే హైప్ క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఊహించని స్థాయిలో ఈ సినిమా హిట్ అయ్యి, బ్లాక్బస్టర్ టాక్ దక్కించుకుంది. మొదటి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ మూవీ, వారం చివర్లో మరింత వేగం అందుకుంది. నాలుగు రోజులకే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 15.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ట్రేడ్ వర్గాల లెక్కలు చూస్తే, లాంగ్ రన్ లో ఈ సినిమా 30 కోట్ల మార్క్ వైపు వెళ్తుందని అంచనా వేస్తున్నారు.
