పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజి”పై ప్రేక్షకుల్లో ఎప్పటి నుంచో మంచి క్రేజ్ ఉంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చుట్టూ ఇప్పటికే హైప్ ఎక్కువగానే ఉండటంతో, ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకపై ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 20న ఈ గ్రాండ్ ఈవెంట్ జరగబోతుందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి వేడుకను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతో పవన్ అభిమానులకు రాబోయే రోజుల్లో పెద్ద ఫెస్టివల్ లాంటి ట్రీట్ దక్కనుంది.
సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా, భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేశాయి.
