పవన్‌ని మెప్పించిన దేవి పాట!

Friday, December 5, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో, శ్రీలీల మరియు రాశి ఖన్నా హీరోయిన్స్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. మాస్ ఆడియన్స్ లో క్రేజ్ పెంచుకున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ స్పీడ్‌గా కొనసాగుతోంది.

ఇటీవల క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు అలాగే ఒక పాట చిత్రీకరణను కూడా పూర్తి చేశారు. ఆ పాట గురించి దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆ సాంగ్ కి చేసిన డాన్స్ అద్భుతంగా ఉందని, ఆ పాట వింటే వెంటనే లేచి నాట్యం చేయాలనిపించేలా ఉందని ఆయన చెప్పారట.

ఈ మాటలతో అభిమానుల్లో ఆ పాటపై ఆసక్తి మరింత పెరిగింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles