ఇండియన్ సినిమా లో స్టార్ హీరోల లిస్ట్ లో ఎప్పుడూ ముందు వరుసలో కనిపించే పేరు ప్రభాస్‌ది. ఈయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు, ఇంకా లైన్ లో ఉన్న ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వాటిలో ఓ ప్రత్యేక ప్రాజెక్ట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఉండటం సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.
ఈ కాంబినేషన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా, ప్రశాంత్ వర్మ తాజాగా ఇచ్చిన స్పందన హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎక్కువ డీటైల్స్ చెప్పలేనని ఆయన క్లారిటీ ఇచ్చాడు. కానీ స్క్రిప్ట్ రెడీగా ఉందని, టీమ్ కూడా సెట్ అయిపోయిందని చెప్పాడు. ప్రభాస్ నుండి సరైన డేట్స్ వచ్చిన వెంటనే షూటింగ్ మొదలవుతుందని ఆయన వెల్లడించాడు.
