గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న భారీ సినిమా “పెద్ది”పై ప్రేక్షకులలో భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
రత్నవేలు ఇటీవల జరిగిన ఒక అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ మాట్లాడినప్పుడు ఆయన, రామ్ చరణ్ ఈ సినిమాలో తనలోని మరో కొత్త కోణాన్ని చూపించబోతున్నారని తెలిపారు. రంగస్థలం సినిమాలో చరణ్ నటన ఎంత బలంగా కనబరిచారో, అదే స్థాయిలో కాక మరింత కొత్తగా ఈ సినిమాలో కనిపించబోతున్నారని అన్నారు.
అలాగే “పెద్ది” షూటింగ్ ఇప్పటికే సగం పూర్తైందని, చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్‌తో వర్కౌట్ అవుతోందని రత్నవేలు చెప్పుకొచ్చారు. ఈ సినిమాను ఒక విభిన్నమైన పద్ధతిలో తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు. రత్నవేలు చెప్పిన ఈ మాటలు బయటకు రావడంతో, రామ్ చరణ్ అభిమానులు మరింత ఎగ్జైటెడ్ అవుతున్నారు.
