మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా, అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు చుట్టూ మంచి బజ్ నెలకొంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, ఒక్కో అప్డేట్ వచ్చేటప్పుడు హైప్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ జోరుగా సాగుతున్న దశలో ఉంది.
తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 19 వరకు కొనసాగనుంది. దీంతో బృందం షూటింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుంది.
ఈ చిత్రంలో వెంకటేష్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అభిమానులకు మాత్రం ఈ సినిమాను వచ్చే సంక్రాంతి పండుగకు బిగ్ గిఫ్ట్‌గా అందించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
