నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ పై ప్రేక్షకుల్లో హైప్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ సీక్వెల్ కోసం అభిమానులు ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ‘ఓజి’తో సమాంతరంగా థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంలో ఆలస్యం కావడంతో ఆ ఆలోచనను వాయిదా వేశారు.
ఇప్పుడేమో అందరి దృష్టి రిలీజ్ డేట్‌పై పడింది. తాజాగా జరిగిన మీడియా చిట్‌చాట్‌లో బాలకృష్ణ ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పాడు. దీంతో ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం రేపింది. అఖండ ఫ్రాంచైజ్‌కు ఉన్న క్రేజ్, బాలయ్య–బోయపాటి జోడీకి ఉన్న స్పెషల్ కనెక్ట్ కారణంగా ఈ సీక్వెల్ కోసం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
