టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొల్పుతున్న సినిమాల్లో ఒకటి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2 – తాండవం. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో సీక్వెల్‌పై మరింత ఆసక్తి పెరిగింది.
మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ కావడంతో రిలీజ్ ప్లాన్ మార్చేశారు. ఇప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది బాలయ్య తీసుకున్న ఒక ప్రత్యేక నిర్ణయం. హిందీ వెర్షన్ కోసం ఆయన స్వయంగా డబ్బింగ్ పూర్తి చేశారు. సాధారణంగా ఇతర భాషల్లో హీరోల డబ్బింగ్ కోసం వేరే ఆర్టిస్టులను పెట్టుకుంటారు. కానీ బాలయ్య తన పాత్రకు తానే హిందీ వాయిస్ ఇచ్చి కొత్తగా ప్రయత్నించారు. దీనితో బాలయ్య వాయిస్ హిందీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో అన్న ఆసక్తి పెరిగింది
