కిష్కిందపురి టాక్‌ బాగుంది..!

Friday, December 5, 2025

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కొత్త సినిమా పేరు కిష్కింధపురి. వీరిద్దరూ గతంలో రాక్షసుడు సినిమాలో కలిసి నటించగా, ఇప్పుడు మరోసారి ఈ హారర్ థ్రిల్లర్‌లో జంటగా కనిపిస్తున్నారు. దర్శకుడు కౌశిక్ పగళ్ళపూడి తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ట్రైలర్‌లో ఒక చిన్న ఊరిలో దయ్యాల గురించి పరిశోధన చేయడానికి వెళ్లే యువతీ యువకుల బృందం కనిపిస్తుంది. అక్కడ నిజంగానే ఆత్మ ఉందని తెలిసి వారు ఎదుర్కొన్న భయానక సంఘటనలు, ఆ దెయ్యం వెనకున్న రహస్యం ఏమిటి, హీరో దానిని ఎలా ఎదుర్కొన్నాడు, హీరోయిన్‌కి ఏమైంది అన్న విషయాలు ఉత్కంఠభరితంగా చూపించారు.

సాయి శ్రీనివాస్ ఈసారి మరింత ఎనర్జీతో, యాక్షన్‌కి సరిపోయే లుక్‌తో కనిపించాడు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles