ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే కొత్త సినిమా గురించి ప్రతి రోజూ కొత్త వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ కారణంగా అభిమానులు కూడా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.
సినిమా రెండో భాగంలో పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్ తో పాటు బలమైన ఎమోషనల్ ట్రాక్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను దర్శకుడు ప్రత్యేకంగా డిజైన్ చేశారని టాక్. ఆ ఫ్లాష్‌బ్యాక్ మాఫియా నేపథ్యంలో సాగుతుందని, అందుకే కథ రాయడంలో ప్రశాంత్ నీల్ ఎక్కువ సమయం ఖర్చు చేశారని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే ప్రత్యేక స్థానం సంపాదించేలా ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు.
