ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందిస్తున్నందున అంచనాలు మరింత పెరిగాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తమిళ పరిశ్రమలో టాప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న యోగి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఆయన ఇప్పటికే షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్టు తెలిసింది.
