మలయాళంలో లేటెస్ట్‌గా రిలీజ్ అయిన సై-ఫై యాక్షన్ సినిమా ‘లోకా’. ఈ సినిమాని తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో టాలెంటెడ్ నటి కళ్యాణి ప్రియదర్శి లీడ్ రోల్‌లో నటించగా, హీరో నెస్లన్ కీలక పాత్రలో కనిపించాడు. మరో స్పెషల్ విషయం ఏమిటంటే, ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించారు.
మలయాళంలో ఈ మూవీ నిన్న రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. కానీ, తెలుగులో ఇవాళ మార్నింగ్ షోస్‌తో ప్రారంభం కావాల్సిన చోట, అన్ని షోస్ అకస్మాత్తుగా క్యాన్సిల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ‘కొత్త లోక’ షోస్ పడకపోవడంతో ఆడియెన్స్, మేకర్స్ రెండింటికీ షాక్ ఇచ్చినట్లైంది.
