మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర మీద సినిమా అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో త్రిష, ఆశిక రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ని పెంచి, ప్రేక్షకుల్లో మరింత కుతూహలాన్ని రేకెత్తించింది.
ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులపై హాట్ టాపిక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ వారు దక్కించుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా వెలువడలేదు.
