యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల వార్ 2 సినిమాలో తన స్టైల్ యాక్షన్ తో ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమాకి వచ్చిన స్పందన తర్వాత ఇప్పుడు ఆయన సోలోగా చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ మీద ఫ్యాన్స్ దృష్టి నిలిచింది. ఈ సినిమా కోసం పరిశీలనలో ఉన్న టైటిల్ ‘డ్రాగన్’. దీనిని కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి, అంచనాలు మరింతగా పెరిగాయి.
కొద్దిగా ఆలస్యంగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. తారక్ కూడా ఇందులో కొత్త లుక్ తో కనిపించబోతున్నారు. అయితే మధ్యలో ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో అభిమానులు కొంచెం నిరాశ చెందారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సెప్టెంబర్ లోనే మేకర్స్ ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ అప్డేట్ ఏంటి అనేది ఇప్పటివరకు రహస్యంగానే ఉంచారు.
