జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ, అక్కడి నుంచి పెద్ద సక్సెస్ మాత్రం అంతగా రాలేదు. తాజాగా ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మాత్రం మంచి అదృష్టం కలిసొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన “దేవర” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జాన్వీ, తన మొదటి సినిమాకే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఆమెకు సౌత్‌లో క్రేజ్ మరింత పెరిగింది.
ప్రస్తుతం జాన్వీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన “పెద్ది” సినిమాలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కూడా పెద్ద అంచనాలను సొంతం చేసుకుంది. ఇకపోతే, బాలీవుడ్‌లో తన కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి రావాలని కోరుకుంటున్న జాన్వీ, ఇప్పుడు కొత్త ప్రయత్నం చేస్తోంది.
