‘గోలీసోడా’, ‘గోలీసోడా 2’ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు, కెమెరామెన్ విజయ్ మిల్టన్ ఇప్పుడు అదే ఫ్రాంచైజీలో మరో కొత్త కథను తెరపైకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన రూపొందిస్తున్న చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. ఇందులో యువ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా ఆయనకు తమిళంలో మొదటి ఎంట్రీ అవుతోంది.
ఈ సినిమాలో సునీల్, వేదన్, భారత్, అమ్ము అభిరామి, కిషోర్, జెఫ్రీరి, భరత్ శ్రీని, పాల డబ్బా, విజిత వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రఫ్ నోట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘గాడ్స్ అండ్ సోల్జర్’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. వినాయక చవితి సందర్భంగా మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు.
