నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన లేటెస్ట్ సినిమా అఖండ తాండవం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ముందుగా వచ్చిన అఖండకు కొనసాగింపుగా వస్తుండటంతో ప్రేక్షకుల్లో హైప్ ఎక్కువైంది. మొదట ఈ సినిమాను 2025 సెప్టెంబర్ 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను ఈ ఏడాది చివరి భాగానికి వాయిదా వేసినట్లు సమాచారం.
ఇక బాలయ్య తర్వాతి ప్రాజెక్ట్ అయిన NBK111 గురించిన చర్చలు కూడా వేడెక్కుతున్నాయి. ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయబోతున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన వీర సింహారెడ్డి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అందుకే ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో మళ్లీ భారీ ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 2న చిత్రాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేసి, దసరా తర్వాత రెగ్యులర్ షూట్ మొదలు పెట్టే ప్లాన్‌లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
