మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు వరుస సర్ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఆయన సినిమాలపై ఇప్పటికే మంచి బజ్ ఉన్నా, బర్త్‌డే స్పెషల్‌గా కొత్త అప్డేట్స్‌తో అభిమానులను మరింత ఎగ్జైటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందనున్న మెగా158 ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి చూపిస్తూ సినిమా ఎంత హింసాత్మకంగా, మాస్‌గా ఉండబోతుందో మేకర్స్ క్లియర్ చేశారు. అంటే ఈ కథలో యాక్షన్‌కి పెద్ద ప్రాధాన్యం ఉంటుందని అర్థమవుతోంది.
దర్శకుడు బాబీ చెప్పినట్లుగా ఈ సినిమా ర్యాంపేజ్ మోడ్‌లో సాగి, అన్ని విభాగాల్లో ప్రేక్షకులను థ్రిల్ చేయనుందని టాక్. చిరంజీవి ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారని ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది.
