టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమా “ఆంధ్ర కింగ్ తాలూకా”పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. మొదటి నుంచే క్రేజీ బజ్ తెచ్చుకున్న ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.
తాజాగా రామ్ లుక్ తో కూడిన పోస్టర్ విడుదల చేస్తూ ఈ సినిమాను నవంబర్ 28న గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురానున్నట్టు మేకర్స్ తెలిపేశారు. దీంతో రామ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆ రోజుని కోసం వేచి చూడాల్సి వస్తోంది.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న వారు వివేక్ మెర్విన్ కాగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం చేపట్టింది.
