సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా సినిమా కూలీ ఇప్పటికే మంచి కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా తర్వాత రజిని మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లకు సిద్ధమవుతున్నారు. అందులో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న జైలర్ 2 ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతున్న తరుణంలో, త్వరలో జరగబోయే షెడ్యూల్‌లో టాలెంటెడ్ నటుడు ఎస్ జె సూర్య కూడా టీమ్‌లో చేరనున్నాడని సమాచారం బయటకు వచ్చింది. ఆయన ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారని కూడా ఫిలిం సర్కిల్స్‌లో హాట్ న్యూస్‌గా మారింది.
