‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి ముహుర్తం కుదిరింది!

Friday, December 5, 2025

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ గురించి సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో, త్రిష మరియు ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ విజువల్ ట్రీట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక అప్డేట్ వస్తుందని ముందే ప్రకటించారు. ఇప్పుడు ఆ అప్‌డేట్ బయటకి వచ్చింది.

మూవీ విడుదల ఆలస్యంపై స్పష్టత ఇవ్వడానికి మేకర్స్ ప్రత్యేక వీడియోను సిద్ధం చేశారు. అందులో చిరంజీవి స్వయంగా కొన్ని విషయాలు చెబుతూ కనిపించనున్నారు. ఈ టీజర్‌ను రేపటికి కాకుండా ఇవాళే సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు విడుదల చేయాలని నిర్ణయించారు.

అలాగే సినిమా రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది వేసవిలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles