మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఒకసారి తన బలప్రదర్శనకు సిద్ధం అవుతున్నారు. ఈ సారి ఇందుకోసం ఆయన ఆకేపాటి అమరనాధ్ రెడ్డి ఇంట్లో శుభకార్యాన్ని అవకాశంగా వాడుకుంటున్నారు. యాత్రల పేరుతో పర్యటనలు సాగిస్తూ టెర్రర్ పుట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి.. ఈ యాత్రలో ఎందరిని బలితీసుకుంటారో అనే భయం పార్టీ వర్గాల్లో, సామాన్యుల్లో వ్యక్తం అవుతోంది.
అన్నమయ్య జిల్లా లోని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి పెళ్లి రిసెప్షన్ మంగళవారం జరుగుతోంది. ఆకేపాడు మండలంలోని ఆకేపాటి ఎస్టేట్స్ లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందుకోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకేపాడు వెళ్లనున్నారు. బాలిరెడ్డిగారిపల్లె వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కు ఆయన మంగళవారం ఉదయం 11.30 కు చేరుకుంటారు. అక్కడినుంచి కొన్ని కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో వెళతారు.
తన యాత్రలకు జనం వెల్లువలా వస్తున్నారని ప్రచారం చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రలను వాడుకుంటున్నా సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఆయన ప్రయత్నాలు వికటిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి, ప్రమాదంలోకి నెడుతున్నాయి. జగన్ గుంటూరు జిల్లా రెంటపాళ్ల యాత్రకు వెళ్లినప్పుడు ఒక కార్యకర్తను తన కారు కిందనే తొక్కించి చంపారు. మరో కార్యకర్త ఆ జనం ఒత్తిళ్ల మధ్య గుండెపోటుతో చచ్చిపోయాడు. నెల్లూరు యాత్రకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. వచ్చిన కొద్దిపాటి జనాన్ని కూడా గుంపులుగా రెచ్చగొడుతూ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తూ.. జనరల్ హాస్పిటల్ ఉన్న రోడ్డులో ప్రయాణించి.. ఆస్పత్రికి వచ్చే రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారు. ధర్మవరంలో పెళ్లికి హాజరైన జగన్ చుట్టూ వైసీపీ మూకలు రెచ్చిపోయి చెలరేగడంతో.. పెళ్లి వేదిక మీద జరిగిన తొక్కిసలాటలో పలువురు మహిళలు కిందపడిపోవడం, ఒక మహిళ అపస్మారంలోకి వెళ్లి ఆస్పత్రిపాలు కావడం జరిగింది. ఇలా జగన్ ఎక్కడ లెగ్ పెడితే చాలు.. అక్కడ విధ్వంసమే జరుగుతోంది. ప్రజల ప్రాణాలకు ప్రమాదమే ఎదురవుతోంది.
ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ఆకేపాడు వెళుతున్న జగన్.. అక్కడ ఎందరి ప్రాణాలను బలిగొంటారో, ఎలాంట ప్రమాదాల్లోకి ప్రజల్ని నెడతారో అని జనం భయపడుతున్నారు. అసలే అదే నియోజకవర్గంలో వొంటిమిట్ట జడ్పీటీసీ స్థానాన్ని ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఆ ఎన్నికలు అరాచకం అని చాటిచెప్పడం కోసం తన ఆదరణ తగ్గలేదని చెప్పుకోవడం కోసం మరింత పెద్దసంఖ్యలో జనాన్ని తోలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో ఏం జరుగుతుందో అని పలువురు భయపడుతున్నారు.
ఆకేపాడుకు జగన్ లెగ్ : ఎందర్ని బలి తీసుకుంటారో?
Friday, December 5, 2025
