ఆ మూవీని టచ్‌ చేయలేకపోయిన అమీర్‌ ఖాన్‌!

Friday, December 5, 2025

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమా విడుదలకు ముందు నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. రజినీకాంత్ హీరోగా కనిపించటం వల్ల బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తుందా అని అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రేక్షకుల నుండి మిక్సిడ్ స్పందన వచ్చింది. ముఖ్యంగా స్టోరీ రైటింగ్ బలహీనంగా ఉందని సినీ విమర్శకులు చెబుతున్నారు.

ఈ సినిమాలో నటీనటుల జాబితా చాలా పెద్దది. ప్రతి పాత్రలో సర్‌ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ ముందే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడని ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఆయన రోల్‌ విక్రమ్ సినిమాలో సూర్య చేసిన రోలెక్స్‌ కంటే ప్రభావం చూపిస్తుందనేలా ప్రచారం జరిగింది.

కానీ ప్రేక్షకులు థియేటర్‌లో చూసినప్పుడు ఆ అంచనాలు తారుమారయ్యాయి. అమీర్ ఖాన్ చేసిన “దాహ” అనే పాత్రలో శక్తి కనిపించలేదని ఫ్యాన్స్ నిరాశ చెందారు. లోకేష్ ఆ పాత్రను చూపించిన తీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, రోలెక్స్‌తో పోల్చడం కూడా కష్టమని అంటున్నారు. ఈ కారణంగా సూర్య చేసిన రోలెక్స్ ఇంకా అభిమానుల మనసుల్లో బలంగా నిలిచిపోయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles