స్పిరిట్‌ లో ప్రభాస్‌ ఎంట్రీ ఎప్పుడంటే!

Friday, December 5, 2025

పాన్ ఇండియా హీరో ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో ఒక పెద్ద ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. ‘స్పిరిట్’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.

సమాచారం ప్రకారం, సెప్టెంబర్ మొదటి వారంలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీని అధికారికంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మరియు ‘ఫౌజీ’ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. ఆ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాతే ‘స్పిరిట్’ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. జనవరి 2026 నుంచి ఆయన ఈ ప్రాజెక్ట్‌లో పని మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఈ చిత్రాన్ను పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. దీనిలో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles