పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూసిన తాజా చిత్రాల్లో “వార్ 2” కూడా ఒకటి. యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమాలో మాస్ అపీల్‌కు పేరుగాంచిన ఎన్టీఆర్ చేరడం వల్లే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి పెరిగింది.
ఈ చిత్రంతో తారక్ తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టగా, ఆయన ఎంట్రీ నిజంగానే థియేటర్లలో సంచలనం సృష్టించింది. తారక్ ఇమేజ్, క్రేజ్ కి తగ్గట్టే మేకర్స్ ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు స్పష్టంగా కనిపించింది. స్క్రీన్ పై ఆయన వచ్చే ప్రతి సీన్ కి భారీ ఎలివేషన్, పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో ఫ్యాన్స్ కి మాస్స్ ఫీస్ట్ అందించారు.
ముఖ్యంగా ఆయన ఎంట్రీ సీక్వెన్స్ నుంచే హాల్లో ఉత్సాహం పెంచేలా డిజైన్ చేయబడింది. క్లైమాక్స్‌లో తారక్ పాత్రకు ఇచ్చిన ఎమోషనల్ టచ్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొత్తానికి, “వార్ 2” ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ లో తన మొదటి అడుగునే ఘనవిజయంగా మార్చుకున్నాడు అని చెప్పాలి
