తమరు ఏ విమర్శలైతే చేస్తారో.. తమలో అలాంటి లోపాల గురించి జనం మాట్లాడుకోకుండా ఎందుకుఉంటారు? చాలా సింపుల్ లాజిక్ ఇది! కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆ లాజిక్ అర్థం అయినట్టు లేదు. లేదా, ఆ లాజిక్ ను అర్థం చేసుకునేంత తెలివితేటలు ఆయనకు లేకపోవచ్చు. అలాంటి అజ్ఞానంలో చంద్రబాబునాయుడు గురించి అనుచితమైన మాటలు మాట్లాడడం ద్వారా.. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి.. ఎలాంటి దుర్మార్గమైన మరణానికి గురయ్యాడో ప్రజలు చర్చించుకునే పరిస్థితిని, మరోసారి హేళన చేసే పరిస్థితిని జగన్ కల్పిస్తున్నారు. తన తండ్రి పరువుపోయేలా ఆయన ప్రవర్తిస్తున్నారు.. అని వైఎస్సార్ అభిమానులు జగన్ మీద గుస్సా అవుతున్నారు.
కడపలో జరిగిన ఎన్నికల గురించి తన గోడు వెళ్లబోసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. కేవలం ఎన్నికల పోలింగ్ గురించి గానీ, అక్కడ అరాచకాలు జరిగాయని తాను వేస్తున్న నిందల గురించి గానీ.. మాట్లాడి ఊరుకుంటే ఆయన జగన్ ఎందుకవుతారు? ఎక్కడెక్కడివో అనేక అంశాలను ఆయన ఏకబిగిన మాట్లాడారు. పనిలో పనిగా.. చంద్రబాబునాయుడు గురించి అత్యంత నీచమైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు.
‘చంద్రబాబూ నీ జీవితానికి ఇది చివరి ఎన్నికలు కావొచ్చు. రామా కృష్ణా అనుకుంటూ ఉండాల్సిన వయసు నీది. కనీసం అలా అనుకన్నా కూడా నీకు పుణ్యం వచ్చేది. కానీ ఇప్పుడు నువ్వు నేరుగా నరకానికే పోతావు’ అని జగన్మోహన్ రెడ్డి తన మనసులోని కోరికను బయటపెట్టుకున్నారు. చంద్రబాబు రామా కృష్ణా అనడం లేదు సరే.. మరి ఏమంటున్నారు? అమరావతి, పోలవరం, ప్రజా సంక్షేమం, బంగారు కుటుంబాలు, మార్గదర్శలు, పీ4 అనే మాటలే మాట్లాడుతున్నారు. పోనీ జగన్ కలగంటున్నట్టుగా ఆయనకు ఇవరి చివరి ఎన్నికలు అనుకున్నా సరే.. ఆయన నరకానికి పోవాలని జగన్ కోరిక! అలా జరిగినా సరే.. ఆయన డెబ్బయి అయిదేళ్లు దాటిన నేత.. సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో గడిపిన నేత. చంద్రబాబు గురించి జగన్ మాట్లాడితే.. మరి ఆయన తండ్రి వైఎస్సార్ గురించి కూడా గుర్తు చేసుకోవాలి కదా?
వైఎస్సార్ ఎంతటి దుర్మార్గుడు కాకపోతే.. ఆయన శరీరభాగాలు కూడా పూర్తిగా దొరకకుండా.. ముక్కలు ముక్కలు అయిపోయినట్టుగా.. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైఉంటారు? ఆయనను ఎన్ని పాపాలు వెంటాబట్టే అంతటి ఘోరమైన మరణం సంభవించింది కదా? అని జగన్ మాటలకు జనం కౌంటర్లు ఇస్తున్నారు. జగన్ కనీస విచక్షణ లేకుండా.. చంద్రబాబు వయసు గురించి, చివరి ఎన్నికలు అనే మాటల గురించి మాట్లాడడం ద్వారా.. తన తండ్రి మరణాన్ని ప్రజలు ఈసడించుకునే, అసహ్యించుకునే వాతావరణాన్ని సృష్టించినట్లు అయింది. తన మాటలు తండ్రి పరువుకు చేసిన డేమేజిని జగన్ ఎప్పటికి గుర్తిస్తారో ఏమో?!
