టాలీవుడ్‌లో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అన్ని రకాల పాత్రల్లో తన ప్రతిభను చాటుకున్న సత్యదేవ్ ఇప్పుడు కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా పేరు ‘రావు బహదూర్’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సత్యదేవ్ లుక్ పోస్టర్‌లో అందరినీ ఆకట్టుకునేలా ఉండగా, దానితో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది!
ఈ చిత్రానికి దర్శకుడిగా వెంకటేష్ మహా పనిచేస్తున్నారు. ఆయన మునుపటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నందున, ఈసారి కూడా ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉంటుందని ఆశిస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ సినిమాను మహేష్ బాబు ప్రజెంట్ చేస్తున్నారు. మహేష్ బాబు హోం బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు గతంలో మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా అడివి శేష్ నటించిన ‘మేజర్’ చిత్రాన్ని ఆయన పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసి, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందించారు.
దాంతో ఇప్పుడు సత్యదేవ్ నటిస్తున్న ఈ ‘రావు బహదూర్’ సినిమాను కూడా మహేష్ బాబు ప్రోత్సహించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ‘మేజర్’తో అడివి శేష్‌కు పెద్ద హిట్ ఇచ్చిన మహేష్, ఈసారి సత్యదేవ్‌కి కూడా అదే స్థాయి విజయాన్ని అందిస్తాడా అనే ఆసక్తి పెరుగుతోంది.
