జగన్ దురహంకారానికి గండికొట్టే అవకాశం ఇది!

Friday, December 5, 2025

పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. ఒక మండలానికి మాత్రమే పరిమితం అయిన చిన్న ఎన్నిక. మహా అయితే పదివేలమంది ఓటర్లు. గెలిచినా కూడా ఒక్క ఏడాది మాత్రమే మిగిలిఉన్న పదవీకాలం. ఇలాంటి నేపథ్యంలో ఈ ఎన్నిక గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు అని ఎవరైనా భావిస్తే పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే.. అధికారంలో ఉన్న తెలుగుదేశం గానీ.. ఇటు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా దారుణంగా ఓటమి పాలైన వైఎస్సార్ కాంగ్రెస్ గానీ.. ఈ ఎన్నికను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. నువ్వానేనా అన్నట్టుగా ఎన్నిక జరుగుతోంది. కాగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు.. ఆయనలో పేరుకుని ఉన్న దురహంకారానికి గండికొట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

జగన్ సీఎం గా ఉండగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఆ క్రమంలో చంద్రబాబునాయుడు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కుప్పం మునిసిపాలిటీకి కూడా ఎన్నికలు జరిగాయి. జగన్ అనుచర గణాలు ఆ ఎన్నికల్లో తమ విశ్వరూపం చూపించాయి. కుప్పం మునిసిపాలిటీ మొత్తం తెలుగుదేశానికి చెందిన కీలక నాయకులు అనేకమందిని బెదిరించి తమ పార్టీలో చేర్చుకున్నారు.  అనేక వార్డులకు సంబంధించి అసలు నామినేషన్లు దాఖలు కాకుండా అడ్డుకున్నారు. ఓటర్లను కూడా బెదిరించారు. అనేక రకాల అరాచకాలు చేసి మొత్తానికి మునిసిపాలిటీని దక్కించుకున్నారు. ఆ ఎన్నికలు ముగిసిన పిమ్మట అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. బీఏసీ సమావేశంలో తెలుగుదేశం పక్ష నేత అచ్చెన్నాయుడుతో జగన్మోహన్ రెడ్డి.. ఒకసారి మీ నాయకుడిని రమ్మని చెప్పు.. మొహం చూడాలని ఉంది.. అంటూ హేళనగా మాట్లాడారు. అక్కడికేదో అరాచకంగా మునిసిపాలిటీని దక్కించుకున్నందుకు.. చంద్రబాబునాయుడినే ఓడించినట్టుగా మురిసిపోయి దురహంకారం ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డి.
ఆ  దురహంకారానికి బుద్ధి చెప్పే, బదులు తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. అందుకోసం పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోవాలని అనుకుంటున్నారు. అసలే వైసీపీ ఓడిపోయిన తర్వాత అత్యంత దయనీయ స్థితిలో ప్రస్తుతం ఉంది. ఆ పార్టీకి భవిష్యత్తు లేనేలేదని పలువురు పార్టీని వీడిపోతున్నారు.  అదే భయంతో ఇప్పుడు పులివెందులలోని పలువురు ఆ పార్టీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తెదేపాలో చేరిన వారిని.. వైసీపీ దళాలు రకరకాలుగా భయపెడుతున్నప్పటికీ.. వారికి ఫలం దక్కడం లేదు.

పైగా ప్రభుత్వ పరిపాలన, చేపడుతున్న పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. వీటన్నింటినీ వాడుకుని.. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే రికార్డు అవుతుందని అనుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయడం అనేది పులివెందుల మండల ప్రజలకు ఇదే మొదటిసారి! కాబట్టి విజయం సాధించి.. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో జగన్ ప్రదర్శించిన దురహంకారానికి జవాబివ్వాలని వారు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles