సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఇది ఆయన 50వ పుట్టినరోజు కావడంతో వేడుకలు ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మహేష్ అభిమానులు ప్రత్యేక ఈవెంట్లు, కట్‌ఔట్స్, బ్యానర్లు, ఫ్యాన్ షోలు ఏర్పాటు చేస్తూ సందడి చేస్తున్నారు.
ఈ సందర్భంగా మహేష్ నటించిన ఒక హిట్ సినిమా తిరిగి థియేటర్లలోకి వస్తోంది. రీ రిలీజ్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి బుకింగ్స్ ఊహించని స్థాయిలో దూసుకెళ్తున్నాయి. పెద్ద ఎత్తున అభిమానులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటూ రికార్డు స్థాయి ఆకర్షణ చూపిస్తున్నారు.
అంతేకాక, అమెరికాలో కూడా ఈ రీ రిలీజ్ కొత్త రికార్డ్ సృష్టించింది. మహేష్ సినిమా అక్కడ 140కి పైగా థియేటర్లలో విడుదల అవ్వడం ఇప్పటివరకు ఎవరూ సాధించని ఘనతగా నిలిచింది. మహేష్ బాబుకు యూఎస్ మార్కెట్‌లో ఎప్పటినుంచో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, ఈ సారి ఆయన ఖాతాలో మరో ప్రత్యేక రికార్డ్ చేరింది.
