మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలి మాత్రం ఆయన నటించిన ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 157 సినిమా పనుల్లో చిరు ఉన్నాడు. ఈ రెండు సినిమాల కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మెగా 157 సినిమా మొదట ప్రకటించినప్పుడు 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తామని టీమ్ చెప్పింది. అయితే, ఇప్పుడు ఆ ప్లాన్ మారే అవకాశం కనిపిస్తోంది. కారణం ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు ఊహించిన కంటే ఎక్కువ సమయం తీసుకోవడం. ఈ ఆలస్యం వల్ల విశ్వంభర సినిమా విడుదల కూడా ముందుగా ఊహించిన టైమ్‌కి కాకుండా, అక్టోబర్ నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
దీతో మెగా 157 సినిమా సంక్రాంతి రిలీజ్ నుండి తప్పుకోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ఇక మేకర్స్ ఈ రెండు సినిమాల విడుదల తేదీలను ఎలా సర్దుబాటు చేస్తారో చూడాల్సి ఉంది.
