జగన్మోహన్ రెడ్డి తను బెంగళూరు యలహంక ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుని తీసుకుని అలసిపోయినప్పుడు.. ఏపీలో రాజకీయం చేయడానికి విజిట్ చేస్తూ ఉంటారు. ఆ రాజకీయం లో భాగంగా.. కొన్న చోట్ల నుంచి పిలిపించుకున్న కొందరు నాయకులు, కొందరు కార్యకర్తలతో కొన్ని సమావేశాలు నిర్వహిస్తారు. ఆలోగా ఎవరైనా చనిపోయిఉన్నా, కొత్తగా అరెస్టు అయి జైళ్లకు వెళ్లినా వారిని పరామర్శించే పేరుతో ఒక ప్రహసన ప్రాయమైన యాత్ర నిర్వహిస్తుంటారు.
ఆ యాత్ర ఎలా జరుగుతుందన్నది షరా మామూలే. జనాలందరూ గోలగోలగా జగన్ మీదికే ఎగబడడం.. అలా జనం తనకోసం ఎగబడివచ్చేలాగా రెచ్చగొట్టేందుకు.. జగన్మోహన్ రెడ్డి అందరికీ కరచాలనాలు ఇచ్చేందుకు అత్యుత్సాహం ప్రదర్శించడం.. వారందరితో ‘సీఎం సీఎం’ అని చకవబారు నినాదాలు చేయించుకోవడం.. ఇదంతా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే.. ఇప్పుడు రాష్ట్ర కమలదళ సారథి పీవీఎన్ మాధవ్.. జగన్ పర్యటనల వెనుక ఉన్న గుట్టును విప్పి చెబుతున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరువు తెచ్చుకున్న జనాలతో రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారని, తన పర్యటనలతో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని మాధవ్ అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేగానే.. ఆ పార్టీ స్థానిక నాయకులకు నరాలు తెగుతున్నాయని, టెన్షన్ తో బీపీ వస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఒక్కొక్క నాయకుడు ఇన్ని వేల మంది జనాల్ని తరలించాలంటూ టార్గెట్లు విధిస్తున్నారు. జగన్ ఒక జిల్లాలో పర్యటించాలంటే.. ఆ చుట్టు పక్కల జిల్లాల వారందరినీ కూడా తరలిస్తున్నారు.
కిరాయియ మూకలనే తరలిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్యక్రమం అయిన తర్వాత గానీ.. పేమెంట్లు ఇవ్వకపోతుండడం వలన.. వచ్చిన వాళ్లు డబ్బులు అందేదాకా వెళ్లకుండా జగన్ యాత్రా నాటకాల్ని రక్తి కట్టిస్తున్నారనేది సమాచారం. నిజానికి జగన్ యాత్రలు పార్టీ ఘోరంగా పరాజయం పాలైన ప్రాంతాల్లోనే. అక్కడేదో తనకు ఏడాదిలోగా బలం విపరీతంగా పెరిగిపోయినట్టుగా బిల్డప్పులు ఇచ్చుకోవడానికి జగన్ చాలా పట్టుదలగా స్థానిక నాయకుల్ని వేధించి మరీ.. జనాన్ని పోగేయిస్తున్నారు.
నిజం చెప్పాలంటే జనం కిరాయి జనాలతోనే తన పర్యటనలు నిర్వహిస్తున్నారనే సంగతి ఎవ్వరికీ తెలియని సంగతి కాదు. ప్రజలందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నదే. కాకపోతే.. ఎవ్వరూ ఓపెన్ గా అలాంటి ఆరోపణలు చేయలేదు. ఇప్పుడు బీజేపీ అద్యక్షుడు పీవీఎన్ మాధవ్.. అసలు గుట్టును ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అరువు తెచ్చుకున్న జనాలే యాత్రల్లో కనిపిస్తున్నారని అంటున్నారు. జగన్ అరాచకాల మీద విమర్శల దాడులు చేయడంలో.. బిజెపి మాధవ్ చాలా యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
