చంద్రబాబు వరాలు.. ఆ వర్గాల్లో ఆనందం!

Friday, December 5, 2025

బడుగు వర్గాల సంక్షేమం ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందనడానికి అచ్చమైన నిదర్శనాలు ఇవి. వారి రోజువారీ బతుకుతెరువుకు భరోసా ఇచ్చే కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చేనేత వర్గాలకు ఉచిత విద్యుత్తు ప్రకటించిన తరహాలోనే, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు కూడా 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించి చంద్రబాబు నాయుడు గొప్ప వరమే ఇచ్చారు. ఈ వరాలపై ఆయా వర్గాలలో సంతోషాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 

చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలోనే చేనేత వర్గాలకు అతిగొప్ప ఆధరువు కాగలిగిన వరాన్ని ప్రకటించారు. వారికి ఉచిత విద్యుత్తు ఇవ్వబోతున్నట్టు చెప్పారు. చేనేత మగ్గాలు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా.. మంగళగిరిలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికుల కోసం మొత్తం మూడు వరాలను కార్యరూపంలోకి తీసుకువచ్చారు. 

వారికి కేవలం ఉచిత విద్యుత్తు ఇవ్వడం మాత్రమే కాకుండా ఐదు కోట్ల రూపాయలతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. రెక్కల కష్టం మీద బతికే ఆ వర్గానికి ఈ నిర్ణయం కూడా గొప్ప మేలు చేయనుంది. ఈ రెండింటి కంటే మరొక గొప్ప విషయం ఏంటంటే.. చేనేత ఉత్పత్తుల మీద ఒక్క రూపాయి కూడా పన్ను పడకుండా బాబు వరం ప్రకటించడం. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చంద్రబాబు అన్నారు. కేంద్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకోవడం అనేది.. రాష్ట్రంలో చేనేత రంగానికి కొత్త ఉత్తేజం ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నిమ్న వర్గాల అభ్యున్నతికి దోహదం చేయడం అంటే.. అచ్చంగా వారికి తలా కొంచం డబ్బులు ఇచ్చేసి.. ఓటు బ్యాంకు గా తయారుచేసుకోవాలని కుట్ర రాజకీయం చేయడం కాదు. వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపి.. వారు స్వయం సమృద్ధంగా, స్వయం సంచాలితంగా ఉండేలా తయారుచేయడమే అభివృద్ధి! గత ప్రభుత్వం ఎక్కడ విఫలమైనదో అక్కడ కూటమి సర్కారు శ్రద్ధ పెడుతోంది. కులవృత్తుల మీద ఆధారపడిన బడుగు వర్గాలకు అతిగొప్ప మేలు గా కూటమి సర్కారు పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles