మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఆయన సినిమాల విషయమై, వ్యక్తిగత విషయమై కూడా సోషల్ మీడియాలో కొన్నిసార్లు నెగటివ్ కామెంట్లు రావడం కొత్తేమీ కాదు. ఈసారి అలాంటి విమర్శలపై చిరంజీవి స్పందించిన తీరు చర్చనీయాంశమైంది.
తనపై విమర్శలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించరని చాలామంది అడుగుతారని, కానీ గతంలో చేసిన మంచి పనులు, ప్రజల నుంచి వచ్చిన ప్రేమ తనకు ఎప్పుడూ రక్షణ కవచంలా ఉంటాయని ఆయన చెప్పారు. అందుకే ఇలాంటి నెగిటివ్ టాక్ కి తాను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు మెగా ఫీనిక్స్ బ్లడ్ డోనేషన్ క్యాంప్‌లో జరిగినప్పుడు బయటపడ్డాయి. ఆ కార్యక్రమానికి తేజ సజ్జ, సంయుక్త మీనన్ కూడా హాజరయ్యారు.
