దూసుకుపోతున్న మహావతార్‌ నరసింహ!

Friday, December 5, 2025

భారీ హిట్‌గా దూసుకెళ్తున్న యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహ’ పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తోంది. ఈ విజయానికి తెలుగు రాష్ట్రాలు కూడా పెద్ద భాగస్వామ్యం అయ్యాయి. రిలీజ్ అయినప్పటి నుంచి ఇక్కడి థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది.

తాజా సమాచారం ప్రకారం, మంగళవారం వరకు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే ఈ చిత్రం దాదాపు 12 కోట్ల షేర్‌ను రాబట్టిందట. అంటే గ్రాస్ కలెక్షన్ల పరంగా ఇది 20 కోట్ల మార్క్‌ను దాటేసినట్టే. ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం చిన్న సినిమాకి పెద్ద విజయం అని చెప్పాలి.

ప్రతి రోజూ సుమారు ఒక కోటి షేర్ చొప్పున వస్తున్నది సినిమాకు మంచి స్థిరమైన రన్ ఉందట్టు చూపిస్తోంది. ఇక ఈ హిట్ జర్నీ ఎక్కడ ఆగుతుందో, చివరికి ఎంత వసూలు చేస్తుందో ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles