అన్ని లెక్కలు తేల్చడానికి ముందే వచ్చిన ఓజీ!

Friday, December 5, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ఓజి మీద సినీ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఈ సినిమాకి యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్ తోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్ నుంచి మొదటి పాట విడుదల విషయమై తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

మేకర్స్ మొదట ఈ పాటను సాయంత్రం విడుదల చేస్తామని ప్రకటించగా, ఆశ్చర్యంగా మధ్యాహ్నమే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘ఫైర్ స్ట్రాం ఈజ్’ అనే టైటిల్‌తో వచ్చిన ఈ పాట, అభిమానుల్లో విపరీతమైన ఎగ్జైట్మెంట్‌ కలిగిస్తోంది. సాంగ్‌లో పవన్ కళ్యాణ్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే. దర్శకుడు సుజీత్ టేకింగ్ కూడా పాటకు స్పెషల్ అట్రాక్షన్ అయింది.

ఇక సంగీత దర్శకుడు థమన్ తన బీట్‌లతో ఇంకొక లెవెల్ లో ఎఫెక్ట్ తీసుకురావడంలో విజయం సాధించాడు. పవన్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్టుగా కనిపించే ఈ మ్యూజికల్ ట్రీట్‌కు థమన్ స్టైల్ మిగిలిన టెక్నికల్ టీమ్ వర్క్‌ను మరింత ఎలివేట్ చేసింది. పాటలో ఓ ప్రత్యేక హైలైట్‌గా జాపనీస్ ర్యాప్‌ను కూడా జోడించడం వినూత్నంగా అనిపిస్తోంది.

అంతేకాదు, గతంలో విడుదలైన హంగ్రీ చీతా గ్లింప్స్‌కు ప్రత్యేక వెర్షన్‌ను రూపొందించడంతో ఓజి మీద క్రేజ్ మరింత పెరిగింది. ఇదంతా చూస్తే ఓజి సినిమాతో పవన్ కళ్యాణ్ మళ్లీ తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమై ఉన్నారనిపిస్తోంది. ఈ ఫస్ట్ సాంగ్‌తోనే మేకర్స్ సినిమాపై ఉన్న హైప్‌ను మరో స్టెప్‌కి తీసుకెళ్లారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles