మెగా డబుల్‌ ట్రీట్‌ ఆ రోజునే అంటున్న అనిల్‌!

Friday, December 5, 2025

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న లేటెస్ట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి మాస్ ఎంటర్‌టైనర్‌లకు పేరుగాంచిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. తన స్పెషల్ స్టైల్ హ్యూమర్, ఎమోషన్స్ మిక్స్ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ వేగంగా జరగుతున్నట్టు ఫిల్మ్ యూనిట్ చెబుతోంది.

తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న ఈ సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని టాక్. ఫ్యాన్స్ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. త్వరలోనే ఈ అప్డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

చిరు ఈ సినిమాలో చేయబోయే క్యారెక్టర్ అభిమానులకు పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందని టీమ్ భరోసా ఇస్తోంది. ఇక కథకు బలం చేకూర్చేలా నయనతార లీడ్ రోల్‌లో నటిస్తోంది. మ్యూజిక్ పై  భీమ్స్ సిసిరోలియో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడు.

ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles