ఉచిత ప్రయాణం.. ఇంకా ఇంప్రూవ్డ్ వెర్షన్ గా అమలు

Friday, December 5, 2025

రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించడం ద్వారా వారిలో సాధికారత పెంచడానికి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పుడు ఆగస్టు 15 వేదీనుంచి కార్యరూపం దాల్చనుంది. అయితే ఈ సందర్భంలో ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఏపీనుంచి మంత్రులు, అధికారులు  బృందాన్ని ఈ పథకం అధ్యయనం నిమిత్తం పొరుగు రాష్ట్రాలకు కూడా పంపిన తరువాత.. దేశంలో మరెక్కడా లేని విధంగా.. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా సగర్వంగా ప్రకటించారు. తీరా ఇప్పుడు ఈ పథకం అమలుకు సంబంధించి.. ప్రాథమిక విధివిధానాలను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ ప్రకటించిన తర్వాత.. ఆ సంగతి స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికలకు ముందు ఏదైతే చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని మహిళలకు హామీ ఇచ్చారో.. అంతకంటె అనేక రెట్లు మెరుగైన రూపంలో, ఇంప్రొవైజ్డ్ వెర్షన్ లో ఇప్పుడు ఉచిత బస్సుప్రయాణం అనేది అమలు కాబోతోంది.

మరో రెండు వారాల్లో అమలు కాబోతున్న ఉచిత బస్సు ప్రయాణం కు సంబంధించి పూర్తి విధివిధానాలు ఇప్పటిదాకా ఖరారు కాలేదు. కేబినెట్ సమావేశం తర్వాత ఇవి ఒక తుదిరూపును సంతరించుకునే అవకాశం ఉంది. అయితే.. ప్రాథమికంగా విధివిధానాల్ని ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎండీ ద్వారకా తిరుమల రావుతో కలిసి  ప్రకటించారు. మహిళలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జారీచేసిన ఏ గుర్తింపు కార్డు చూపించి అయినా.. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని ఆయన వెల్లడించారు. అంటే ఆధార్, ఓటర్ గుర్తింపు, పాన్ కార్డుఅల్లో ఏది చూపించినా పర్లేదని అన్నారు.

అదే సమయంలో ఇక్కడ ప్రధానమైన సంగతి గమనించాలి. తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినది కేవలం తమ సొంత జిల్లాల్లో ఉచితంగా ప్రయాణించే హామీ మాత్రమే. మధ్యలో ఆ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలకు కూడా విస్తరించాలని కసరత్తు చేశారు. కానీ చంద్రబాబు చెప్పినట్టుగా మరింత ఘనంగా మహిళలు రాష్ట్రమంతా ఉచితంగా అయిదు రకాల బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల మహిళాలోకంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇన్నాళ్లూ జగన్మోహన్ రెడ్డి దళాలు సూపర్ సిక్సో సెవెనో ఏవీ కనపడ్డం లే.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఉచిత ప్రయాణం గురించి పదేపదే రచ్చ చేశారు. కానీ ఒక జిల్లాకు కల్పిస్తామని ప్రకటించిన అవకాశాన్ని ఒక రాష్ట్రానికి మొత్తం వర్తించేలా ప్రభుత్వం అమలు చేస్తోంటే.. పాపం ఏం మాట్లాడాలో తెలియక, ఈ పథకంపై ఎలా నిందలు వేయాలో అర్థం కాక నోర్లకు తాళాలు వేసుకుని కూర్చున్నారు. కాకపోతే.. అడ్రసు వివరాలు , సొంత ఊరు వివరాలు ఉండని పాన్ కార్డునుకూడా అనుమతించేట్లయితే.. ఇతర రాష్ట్రాల మహిళలు కూడా ఇక్కడ ఉచితంగా ప్రయాణం చేయవచ్చు కదా.. ఆ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? లేదా వారిని కూడా అనుమతిస్తారా? అనే స్పష్టత ఇంకా రాలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles