11 కోట్లపై ఈడీ నజర్ : వారికి ఇక దబిడి దిబిడే!

Friday, December 5, 2025

హత్యలు వంటి నేరాలు కూడా వారికి అంత సీరియస్ గా కనిపించవు. కానీ.. ఆర్థిక లావాదేవీల విషయంలో మతలబులు చేసి దేశాన్నే మోసం చేసే నేరాలకు పాల్పడితే మాత్రం వారు యమ సీరియస్ అయిపోతారు. ఆ డిపార్టుమెంటు పేరే ఎన్‌ఫోర్స్‌మెట్ డైరక్టరేట్! మనీ లాండరింగ్, హవాలా, పన్నుల ఎగవేత, బ్లాక్ మనీ  వంటి వ్యవహారాల్లో చిన్న చిన్న నేరాలు తమ దృష్టికి వచ్చినా కూడా ఈడీ చాలా సీరియస్ గా స్పందిస్తూ ఉంటుంది. చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఒక పరిమితి వరకు న్యాయాధికారాలు కూడా ఉండే విచారణ సంస్థ ఈడీ. అలాంటి ఈడీ దృష్టిని ఇప్పుడు జగన్ దళాలు పాల్పడిన లిక్కర్ స్కామ్ చాలా బలంగా ఆకర్షిస్తున్నట్టుంది. లిక్కర్ స్కామ్ లో కాజేసిన సొమ్మును హైదరాబాదు సమీపంలోని కాచారం ఫాంహౌస్ లో దాచి ఉంచగా సిట్ పోలీసులు స్వాధీనం చేసుకున్న తీరుపై పూర్తి వివరాలు తమకు ఇచ్చి సహకరించాలని.. ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు వారు సిట్ ను సంప్రదించి దొరికిన నిధుల వివరాలు రాబడుతున్నారు.

మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటిదాకా కొన్ని సంగతులు నిర్ధరణ అయ్యాయి. మూడున్నర వేల కోట్ల రూపాయలు కాజేశారని సిట్ అధికారులు తేల్చారు. అలాగే.. ఏక్రమంలో దోపిడీ జరిగిందో కూడా వారు తేల్చి చెప్పారు. అదే సమయంలో.. లిక్కర్ కుంభకోణంలో కాజేసిన సొమ్ములో వేల కోట్ల రూపాయలు.. దేశం సరిహద్దులు దాటి దుబాయిలోని ఇన్‌ఫ్రా కంపెనీల్లోకి హవాలా మార్గంలో పెట్టుబడులుగా వెళ్లాయని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఏకంగా పార్లమెంటులోనే ఆరోపణలు చేశారు. దరిమిలా.. హోం మంత్రి అమిత్ షా.. లావును తన వద్దకు పిలిపించుకుని దానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు తన వద్ద ఉన్న ఆధారాలను కూడా హోంమంత్రికి సమర్పించి.. ఈ విషయంలో ఈడీతో దర్యాప్తు చేయించాల్సిన అవసరాన్ని ఆయనకు తెలిపారు. మొత్తానికి ఇటీవలే లిక్కర్ కుంభకోణంలోకి ఈడీ రంగప్రవేశం చేసింది. సిట్ కు సమాంతరంగా విచారణ ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో వరుణ్ పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగా ఏకంగా 11 కోట్లరూపాయలు దాచిపెట్టిన డంప్ ను సిట్ పోలీసులు కనుగొనడం, డబ్బు స్వాధీనం చేసుకోవడం ఈ కేసులోనే పెద్ద మలుపు. దీంతో ఇదే రోజున ఈడీ కార్యరంగంలోకి దిగింది. 11 కోట్ల రూపాయలకు సంబంధించి సిట్ వద్ద ఉన్న వివరాలన్నీ తమకు అందజేయాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని, అనేక వ్యాపారాలు కలిగిఉన్న విజయేందర్ రెడ్డి కి చెందినది అయి ఉండవచ్చునని రాజ్ కెసిరెడ్డి పిటిషన్ వేశారు గానీ.. ఈడీ రంగప్రవేశం చేసిన తర్వాత.. అది ఎవరిదైతే వారు.. కటకటాలు లెక్కించక తప్పదు అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఒక్క ఏడాదిలో అంత లెక్కల్లో చూపని నగదుకు సంబంధించి శిక్షలు తప్పించుకోలేరని అంటున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా.. కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి తీసుకువెళ్లినది ఈడీ అధికారులే కావడం ఇక్కడ గుర్తుచేసుకోవాల్సిన సంగతి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles