వార్‌ 2 ని అలానే చూడాలి!

Friday, December 5, 2025

ప్రస్తుతం బాలీవుడ్ కంటే టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ భారీగా హైప్ క్రియేట్ చేసిన సినిమాల్లో “వార్ 2” టాప్ లో నిలుస్తోంది. ఎన్టీఆర్ జూనియర్ మరియు హృతిక్ రోషన్ లు కలిసి స్క్రీన్ పంచుకుంటున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ చిత్రం సాంకేతికంగా కూడా ఒక స్టెప్ ముందుంటుందని భావిస్తున్నారు.

విషేషమేంటంటే, ఈ సినిమా డాల్బీ విస్తా ఫార్మాట్‌లో ఇండియా నుంచి రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీగా నిలవబోతోంది. అంటే సౌండ్ డిజైన్, విజువల్స్ అన్నీ అత్యాధునిక టెక్నాలజీతో ప్రేక్షకుడికి థియేటర్ లో స్పెషల్ అనుభవం కలిగించబోతున్నాయన్న మాట. దర్శకుడే ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, ‘వార్ 2’ అసలు సదుపాయం అనుభవించాలంటే డాల్బీ వెర్షన్‌లోనే చూడాలని సూచిస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. అప్పటివరకు మిగిలిన అప్డేట్స్‌తో పాటు టీజర్, ట్రైలర్ లు కూడా సినిమా మీద హైప్ ను మరింత పెంచే అవకాశముంది. ప్రస్తుతం యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ లో ఇది మరో క్రేజీ ఛాప్టర్ అవుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles