టాలీవుడ్‌లో ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్‌కి మించినది ఆయనకు అభిమానులు పెట్టిన పేరు ‘డార్లింగ్’. ఈ పేరు ఆయనకి వచ్చిందంటే, దానికి కారణం బుజ్జిగాడు సినిమా. ఆ సినిమాతోనే ‘డార్లింగ్’ అనే ట్యాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ సినిమా ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో ప్రభాస్‌కి ఏర్పడిన బంధం కూడా ప్రత్యేకమే.
ఇప్పుడు మళ్లీ చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడమే కాకుండా, కలిసి సరదాగా గడిపిన పలు ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రభాస్ నటిస్తున్న “ది రాజా సాబ్” అనే చిత్ర సెట్లోకి పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కలిసి వెళ్లారు. అక్కడ ప్రభాస్ పూరిని కౌగిలించుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీరి మధ్య ఉన్న స్నేహం ఇప్పటికీ అంతే గాఢంగా ఉందని ఈ ఫోటోలే చెబుతున్నాయి.
ఇక పూరి ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఓ భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. మళ్లీ పూరి-ప్రభాస్ కాంబో ఎప్పుడైనా సినిమాగా కనిపిస్తుందా? అన్న ఆసక్తి మాత్రం అభిమానుల్లో మొదలైపోయింది.
