రాజాసాబ్‌ నుంచి భయపెడుతున్న సంజయ్‌ పోస్టర్‌!

Friday, December 5, 2025

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్ గురించి సినిమాభిమానులకి పెద్ద ఎగ్జైట్‌మెంట్ నడుస్తోంది. మారుతీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఓ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరపైకి రానుంది. టీజర్ విడుదలైనప్పటి నుంచే సినిమాపై బజ్ మ‌రింత పెరిగిపోయింది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. వీరందరి మధ్య వచ్చే ఎమోషన్లు, కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించేలా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. టీజర్‌లో అతని లుక్ కాస్త మిస్టీరియస్ గా ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఒక కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఇందులో అతను మీసం మెలేస్తూ, గాఢమైన దృష్టితో కనిపిస్తున్న లుక్‌ ఆడియెన్స్‌ని ఆకర్షిస్తోంది. ఆయన పాత్ర మిస్టరీతో కూడిన పాతకాలపు రాజుల తరహాలో ఉండనుందనేది ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా పని చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాను మరో వేరియంట్ గా చూడబోతున్నారు. హారర్, కామెడీ, స్టైల్ అన్నీ కలిపి రూపొందుతున్న ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles